మండపేట: జగన్‌పై దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి: వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు డిమాండ్
జగన్‌పై దాడి చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు డిమాండ్ చేశారు. మండపేట మండలం కేశవరంలో జగన్‌పై దాడి ని ఖండిస్తూ నిరసన తెలియజేశారు. పేదల పక్షాన నిలిచే జగనన్నపై పెత్తందారుల రాళ్లదాడి అంటూ ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆదివారం సాయంత్రం వెంకన్న బాబు మాట్లాడుతూ ప్రజా స్పందన చూసి ఓర్వలేక కుళ్లుతో కూటమి నాయకులు జగన్‌పై దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు.