సత్తుపల్లి: సత్తుపల్లి చెరువు రెస్క్యూ ఆపరేషన్: 11 మంది సిబ్బందిని కాపాడిన కలెక్టర్
ఖమ్మం జిల్లా సత్తుపల్లి బేతుపల్లి చెరువులో బోట్లు బోల్తా పడి చిక్కుకున్న 11 మంది ఎస్ఆర్ఎఫ్ సిబ్బందిని కలెక్టర్ దివాకర టీఎస్ పర్యవేక్షణలో సురక్షితంగా రక్షించారు. రాత్రంతా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించిన కలెక్టర్ కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు.