తాడిపత్రి: రావులుడికిలో అత్యంత ఘనంగా ముగిసిన చెన్నమ్మ తల్లి తిరుణాల (బండి శూల) ఉత్సవాలు
పెద్దవడుగూరు మండల పరిధిలోని రావులుడికి, భోగాల కట్ట, కోనాపురం లలో గత మూడు రోజులుగా చెన్నమ్మ తల్లి తిరుణాల (బండి శూల) ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చెన్నమ్మ తిరుణాల ఉత్సవాలు ఎంత ఘనంగా ప్రారంభమయ్యాయో అంతే ఘనంగా ముగిశాయి. ముగింపు సందర్భంగా చెన్నమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.