అయిజ: గూడిదొడ్డిలో గ్రామసభ: నీటి సంరక్షణపై గ్రామస్తులకు అధికారుల అవగాహన
అయిజ మండలం గూడిదొడ్డిలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్-VGPPపై గ్రామసభ జరిగింది. గ్రామంలో ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణం ద్వారా నీటిని సంరక్షించాలని సర్పంచ్ వరలక్ష్మి వెంకటరామిరెడ్డి మరియు అధికారులు గ్రామస్తులకు పిలుపునిచ్చారు.