ప్రతి నెలా ఒకరి కన్నీటి కథ... ఇప్పుడు మరో కుటుంబంలో విషాదం...
చిన్నమండెం మండలంలోని వండాడి గ్రామం సమీపంలోని తూర్పుపల్లె బస్టాప్ వద్ద ఉన్న మలుపు మరోసారి ప్రాణం బలిగొంది. ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బోర్ వెల్స్ శేఖర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.లారీ – ఇనోవా మధ్య ఎదురెదురుగా జరిగిన ఢీకొట్టుకలో ఈ ప్రమాదం సంభవించింది. శేఖర్ రెడ్డి ఇనోవాలో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.తూర్పుపల్లె మలుపు ప్రమాదాలకు కేంద్రమై మారిందని స్థానికులు చెబుతున్నారు.