చీర పైటకొంగు బైకు వెనుక చక్రానికి చుట్టుకొని జారి పడి మహిళ మృతి
చీర పైటకొంగు బైక్ వెనుక చక్రానికి చుట్టుకొని జారి పడిన మహిళ మృతి చెందిన సంఘటన భామిని మండలం ఘనసరి గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. పాలకొండకు చెందిన కొండేటి కవితమ్మ 45 తన తల్లి సంవత్సరీకం ఆదివారం చేసేందుకు గుణుపూర్ కు తన భర్తతో కలిసి బైక్ పై వెళ్తుండగా ఘనసరి గ్రామ సమీపంలో ఆమె పైటకొంగు బైక్ వెనుక చక్రానికి చుట్టు కావటంతో ఆమె జారిపడి మృతి చెందింది. మన హృదయాన్ని పాలకొండ ఆసుపత్రికి తరలించారు. భార్య మృతి చెందడంతో భర్త జనార్ధన రావు కన్నీరు మున్నీరయ్యాడు.