తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం వేడమ్ మిట్టకంటిక గ్రామంలో కుటుంబ కలహాలతో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బత్తిరెడ్డి కుటుంబంలో కలహాలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ కి తరలించారు అతని పరిస్థితి పూర్తి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు అనంతరం 108 సహాయంతో కుటుంబ సభ్యులు తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు