శ్రీకాకుళం: సంతబొమ్మాళి: ఉపాధి హామీ పనులు చేస్తూ మహిళ మృతి
సంతబొమ్మాళి గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్ళిన గాయశ్రీ (55) అనే మహిళ మంగళవారం మృతి చెందారు. కొండ సమీపంలో ట్రెంచ్ పనుల వద్ద మస్టర్ వేస్తుండగా ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కోటబొమ్మాళి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు ఏపీవో మూర్తి తెలిపారు.