కర్నూలు: నిరుద్యోగ భృతి ఇవ్వడంలో టీడీపీ విఫలం: పందికోన ఈరన్న
నిరుద్యోగ భృతి మరియు సూపర్ సిక్స్ పథకాల అమలులో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని బీసీవై పార్టీ చైర్మన్ అభ్యర్థి పందికోన ఈరన్న ఆరోపించారు. తనను గెలిపిస్తే యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇస్తూ టార్చ్‌లైట్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.