ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఎస్సై జాడి శ్యాంరావు బుధవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. బైకులు ఆపి బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఇద్దరిపై కేసు నమోదు చేశారు. తప్పనిసరిగా లైసెన్స్, అనుమతి పత్రాలు ఉండాలని సూచించారు.