రాజోలు: రాజోలులో పిడుగుపాటు: పేలిన గ్యాస్ సిలిండర్, కాలిబూడిదైన ఇల్లు
రాజోలు మండలం శివకోడు గ్రామంలో పిడుగుపాటుకు తాటాకిల్లు కాలిబూడిదైంది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.