సంగారెడ్డి: సంగారెడ్డిలో వయోవృద్ధుల దినోత్సవం: ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
సంగారెడ్డి మహిళా ప్రాంగణంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు జరిగాయి. వయోవృద్ధులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య తెలిపారు. ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.