ఒంగోలు అర్బన్: ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు వేడుకలు, ఎంపీ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు
Ongole Urban, Prakasam | Oct 15, 2026
ప్రకాశం: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి 73వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం మాగుంట కార్యాలయంలో ఎంపీ మాగుంట పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టిడిపి నాయకులు కార్యకర్తలతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అతని కుమారుడు రాఘవరెడ్డి పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన ఎంపీపీ నాయకులు కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.