వరంగల్: పంట నష్టంతో రైతుల ఆవేదన, కరువు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ డిమాండ్
వరంగల్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోవడంపై సీపీఐ ఆందోళన చేపట్టింది. గీసుగొండ, నల్లబెల్లి, ఖానాపురం, రాయపర్తి, వర్ధన్నపేట మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, రైతులకు నష్టపరిహారం అందించాలని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు.