ఒంగోలు అర్బన్: ఒంగోలు పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ హర్ష వర్ధన్
Ongole Urban, Prakasam | Aug 22, 2026
జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో జిల్లా ఎస్పీ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరసమీక్షా సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ ముఖ్యంగా దర్యాప్తులో ఉన్న హత్య, POCSO /రేప్ కేసులు, ప్రాపర్టీ నేరాలు, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు, పెండింగ్ లో ఉన్న కేసులు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్, పెండింగ్ NBWs పై CCTNS మరియు రానున్న స్ధానిక ఎన్నికలపై సమీక్షించారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల నమోదు, నిందితుల అరెస్టు, విచారణ, ఛార్జీషీటు దాఖలు మరియు పెండింగ్ కేసులు తదితర అంశాలపై పోలీస్ అధికారులను ఆరా తీశారు. నేర నియంత్రణ, నేరాల ఛేదించుట, అసాంఘిక కార్యకలాపాల కట్టడి చేయాలన్నారు