అదిలాబాద్ అర్బన్: విదేశీ పత్తి దిగుమతులపై కాంగ్రెస్ నిరసన: పత్తి ధరలపై ఎఫెక్ట్
విదేశీ పత్తి దిగుమతుల వల్ల క్వింటాలుకు 1000 రూపాయల ధర తగ్గిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో జరిగిన సమావేశంలో పత్తి రైతుల కష్టాలపై కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి స్పందించారు. దిగుమతులు ఆపాలని కేంద్రానికి డిమాండ్ చేశారు.