శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన సైన్స్ అండ్ స్పిరిచ్యాలిటీ ఎగ్జిబిషన్ను సోమవారం మేనేజింగ్ ట్రస్ట్ ఆర్జే రత్నాకర్ ప్రారంభించారు. సత్యసాయి విద్య సంస్థ హయ్యర్ సెకండరీ స్కూల్లో 150 మంది బాలవికాస్ గురువుల సారథ్యంలో 250 మంది విద్యార్థులు సృజనాత్మకంగా రూపొందించిన 170 వినూత్న ప్రదర్శనలు ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రదర్శించగా, ప్రజలు తిలకించి హర్షం వ్యక్తం చేశారు