సైబర్ నేరాలకు పాల్పడే అంతరాష్ట్ర ముఠాలోని ముగ్గురిని కావలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరూ బీహార్లోని జాంతారా జిల్లాకు చెందిన వారు. వారు కావలికి చెందిన ఓ వ్యక్తికి ఫోన్లో ఆర్టీఓ 'ఈ' చలానా APK ఫైల్ పంపారు. అందులో తనకు ఏమైనా పెండింగులు ఉన్నాయా అని ఆ వ్యక్తి ఫైల్ను క్లిక్ చేసాడు. దీంతో క్షణాల్లో అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.24 లక్షలు దోచేశారు. పోలీసులు రూ. 21.90 లక్షలు రికవరీ చేశారు.