బనగానపల్లె: బనగానపల్లెలో 29 ఎంపిటిసి స్థానాలకు 59 నామినేషన్లు
బనగానపల్లె మండలంలో MPTC నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. 29 MPTC స్థానాలకు మొదటి రెండు రోజులు ఎవరూ నామినేషన్ వేయలేదు. చివరి రోజు శుక్రవారం 59 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి సుధాకర్ తెలిపారు. వైసీపీ తరఫున 29 మంది, టీడీపీ నుంచి 28, జనసేన నుంచి 2 నామినేషన్లు వేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేశారు.