శ్రీశైలం: కాణిపాకం బ్రహ్మోత్సవాల సందర్భంగా వరసిద్ధి వినాయకునికి మహానంది దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పణం
కాణిపాకంలో వెలసిన వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మహానంది దేవస్థానం తరఫున ఛైర్మన్ నరాల చంద్రమౌళీశ్వర రెడ్డి, ఈవో శ్రీనివాసరెడ్డి, పట్టువస్త్రాలు సమర్పించారు. కాణిపాక ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు, వేదపండితులు మహానంది దేవస్థానం అధికారులను ఘనంగా ఆహ్వానించారు. ఆలయ ఆనవాయితీ ప్రకారం ప్రతిఏటా పట్టు వస్త్రాలను తీసుకెళ్తున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం మహానంది దేవస్థాన అధికారులతో అర్చకులకు స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు