ఒంగోలు అర్బన్: అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు వెల్లడి
Ongole Urban, Prakasam | Oct 14, 2026
అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో ప్రకాశం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కలెక్టరేట్లో సీఆర్డీఏ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతస్థాయి బృందంతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో అవకాశాలను గుర్తించి, అభివృద్ధికి అడ్డంకులను తొలగించడంపై చర్చించారు. రామాయపట్నం పోర్టు, భారీ పరిశ్రమలతో వేలాది నిరుద్యోగ యువతకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యోగా అవకాశాలు ఏర్పడతాయని కలెక్టర్ రాజాబాబు అన్నారు.