మిర్యాలగూడ: మిర్యాలగూడలో రైతుల ధర్నా: 3 కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్
మిర్యాలగూడ శ్రీనివాస్ నగర్ సాంబశివ రైస్ మిల్లు వద్ద వడ్ల ధర తగ్గింపు, కొనుగోళ్ల నిలిపివేతపై రైతులు ధర్నా చేపట్టారు. ఇతర రాష్ట్రాల వడ్ల దిగుమతిని నిరసిస్తూ కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.