రాయదుర్గం: పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
రాయదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎం. హనుమంతరెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాయదుర్గం కోర్టు ప్రాంగణంలో సీనియర్ న్యాయవాదుల సమక్షంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. అధ్యక్షులుగా వన్నూరస్వామి, హనుమంతరెడ్డి పోటీ పడగా హనుమంతరెడ్డి విజయం సాధించినట్లు ఎన్నిక నిర్వాహకులు తెలిపారు. అలాగే ఉపాధ్యక్షులుగా శ్యామల, ప్రధాన కార్యదర్శిగా పృధ్వి రాజ్, సహాయ కార్యదర్శిగా కుళ్ళాయప్ప, కోశాధికారిగా రేణుక రమ్యశ్రీ లు ఎన్నికయ్యారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారు తెలిపారు.