గుంటూరు: గుంటూరులో జోరుగా ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారం: కార్యాలయాల ప్రారంభం
Guntur, Guntur | Oct 22, 2026 గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో కలిసి ఆమె పలు డివిజన్ల పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు, కూటమి అభ్యర్థులు పాల్గొన్నారు.