తమకు ప్రాణహాని ఉందని, గతంలో పోలీసులకు తెలిపినా దాడులు జరుగుతూనే ఉన్నాయని కావలి పట్టణానికి చెందిన పూనూరు కామాక్షి, చేజర్ల గీతాంజలి అనే తల్లీ కుమార్తె తెలిపారు. కావలి జర్నలిస్ట్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియాతో సమావేశంలో వారు సంచలన ఆరోపణలు చేశారు. గీతాంజలి మాట్లాడుతూ ..2021లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి గెస్ట్ హౌస్ లో పమిడి రవికుమార్ చౌదరి సమక్షంలో తన భర్త, కొందరు తనపై దాడి చేసినట్లు తెలిపారు. అప్పటిలో కావలి రెండో పట్టణ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టగా పమిడి రవికుమార్ చౌదరి ఏ 5గా ఉన్న