శ్రీకాకుళం: శ్రీకాకుళం బీచ్లో విషాదం: సెల్ఫీ కోసం వెళ్లి సముద్రంలో గల్లంతైన ఇద్దరు బిటెక్ విద్యార్థులు
శ్రీకాకుళం పెదగనగళ్లవానిపేట బీచ్లో సెల్ఫీ తీసుకుంటూ సముద్రంలో పడి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మణికంఠ, మనోజ్ గల్లంతయ్యారు. మత్స్యకారుల హెచ్చరికలను బేఖాతరు చేసి గ్రోయిన్ వద్దకు వెళ్లిన క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.