వనపర్తి: వనపర్తి ఐటీ టవర్: 2027 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం
వనపర్తి జిల్లా నాగవరం వద్ద రూ.22 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఏప్రిల్ 2027 నాటికి పనులు పూర్తి చేసి అప్పగించాలని అధికారులను, కాంట్రాక్టర్ను ఆయన ఆదేశించారు.