బోథ్: ఫుడ్ పాయిజన్ తో పొచ్చర సెయింట్ థామస్ పాఠశాలలో పనిచేస్తున్న యువతి మృతి
బోథ్ మండలం పొచ్చరలో గల సెయింట్ థామస్ పాఠశాలలో వంటమనిషి గా పనిచేసే పూల్ కాలీ బైగా (19) యువతి ఫుడ్ పాయిజన్ తో మృతి చెందింది.సెయింట్ థామస్ పాఠశాల సిబ్బంది ఆడివారం షాపింగ్ కొరకు నిర్మల్ కు వెళ్లి అక్కడే రెస్టారెంట్ లో భోజనం చేసి తిరిగి పాఠశాలకు చేరుకున్నారు.అదే రోజు అర్ధరాత్రి నుంచి తీవ్ర మైన వాంతులతో విరేచనాలు అవ్వగా సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. వారికి ఫుడ్ పాయిజన్ అయిందని వైద్యులు నిర్ధారించారు.మంగళవారం రోజు కూడా నలుగురు సిబ్బంది ఆసుపత్రికి చెకప్ కోసం వెళ్లగా వంట మనిషిగా పనిచేస్తున్న పూల్ ఖాళీ బౌగా అనే యువతి చికిత్స పొందుతూ మృతి చెందింది.