శ్రీశైలం: ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ బరిలో ఇద్దరు యువ డాక్టర్లు
ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్టి రిజర్వు కావడంతో ఆత్మకూరులో రాజకీయ రంగు మారిపోయింది. ఎప్పుడు రాజకీయ సంబంధం లేని కుటుంబాల నుంచి ఇద్దరు యువ డాక్టర్లు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్నారు.తెలుగుదేశం పార్టీ నుంచి ఆత్మకూరు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు గోవిందరాజులు పోటీ చేస్తుండ గా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్ ప్రియాంక భాయ్ నామినేషన్ దాఖలు చేసింది. ఇద్దరు డాక్టర్లు కావడం విశేషం ఇద్దరికీ రాజకీయ అనుభవం లేని వారు కావడం విశేషంగా మారింది.