ఒంగోలు అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం లో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎస్పీ
Ongole Urban, Prakasam | Aug 24, 2026
ప్రజా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను జిల్లా ఎస్పీ స్వీకరించారు. పిర్యాదుదారులతో ఎస్పీ ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. జిల్లా ఎస్పీ ఆయా ఫిర్యాదులపై సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో వెంటనే ఫోన్ లో మాట్లాడారు