ఖానాపూర్: హీరాపూర్ గ్రామంలో ఘనంగా దండారి ఉత్సవాలు: పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్ మండలం హీరాపూర్ గ్రామంలో జరిగిన దండారి ఉత్సవాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఆదివాసీ సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఒక్కో బృందానికి 15 వేల ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు.