కర్నూలు: కర్నూలులో దారుణం: టార్చిలైట్ వేశాడని యువకుడిని కొట్టి చంపిన దుండగులు
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బింగిదొడ్డిలో టార్చిలైట్ వేసిన విషయంలో జరిగిన ఘర్షణలో 23 ఏళ్ల నవీన్ మృతి చెందాడు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులతో జరిగిన గొడవలో నవీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలిసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.