కర్నూలు: ఎమ్మిగనూరు 44వ వార్డులో సీపీఎం అభ్యర్థి కే. కృష్ణ ఇంటింటి ప్రచారం
ఎమ్మిగనూరు 44వ వార్డు సీపీఎం అభ్యర్థి కే. కృష్ణ నాయి బ్రాహ్మణ కాలనీలో ప్రచారం చేశారు. కాలనీలో 30 ఏళ్లుగా మౌలిక వసతుల సమస్యలు పరిష్కారం కాలేదని, తనను గెలిపిస్తే సమస్యలు తీరుస్తానని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.