మార్కాపురం: మహాత్మా గాంధీ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా
మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాత్మ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి ఎస్పీ పంకజ్ కుమార్ మీనా పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గాంధీ చూపిన సత్యం అహింస శాంతి సామరస్య మార్గాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయము అని అన్నారు గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో శాంతి భద్రత సోదర భావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన శాంతియుతమైన న్యాయబద్ధమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.