కొత్తపేట: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా తొలి హారతి మహోత్సవం
ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం వేకువజామున తొలి హారతి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. విశేష పూజలు, అర్చనలతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.