మార్కాపురం: హార్టికల్చర్ హబ్బుతో మార్కాపురం జిల్లా రైతులకు విశేష ప్రయోజనం : కలెక్టర్
హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రకాశం మార్కాపురం జిల్లాల రైతులకు విశేష ప్రయోజనం కలుగుతుందని జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. మదనపల్లి లో జరిగే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలెక్టర్ వీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉద్యాన పంటల సాగుకు పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు పనుల తోటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఉద్యాన పంటల సాగుకు అవసరమైన సాంకేతిక సహకారం ప్రభుత్వ సబ్సిడీలను రైతులకు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు.