మందమర్రి: మందమర్రిలో వీధి కుక్కల బీభత్సం: భయాందోళనలో స్థానికులు
మంచిర్యాల జిల్లా మందమర్రిలోని పాలచెట్టు, దొర్లబంగ్లా ప్రాంతాల్లో వీధి కుక్కల గుంపులు సంచరిస్తున్నాయి. రోడ్లపై కుక్కల ఉధృతితో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.