పూతలపట్టు: కాణిపాకం వరదరాజ స్వామి ఆలయంలో ఘనంగా శ్రావణ లక్ష్మీ వ్రతం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో శ్రావణ లక్ష్మీ వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించారు. గరుడ సేవతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.