ఒంగోలు అర్బన్: తమను మోసం చేసిన వైట్ కాలర్ దొంగలపై చర్యలు తీసుకోకపోతే సోమవారం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించిన మహిళలు
Ongole Urban, Prakasam | Sep 18, 2026
తమను ఒక గ్రూపుగా చర్చి ఒక్కొక్కరికి 20 వేల రూపాయలను ఇచ్చి భారీ మొత్తంలో నగదును అధికార యంత్రాంగం దోచుకున్నట్లుగా మహిళలు ఆరోపిస్తూ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమను ఒక గ్రూప్ గా చేర్చిన ఆర్పి బ్యాంక్ అధికారులు తమ మోసం చేసి భారీగా నగదు దోచుకున్నారని మహిళలు ఆరోపించారు ఇప్పటికే పోలీసులకు జిల్లా అధికారులకు కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించినట్లుగా తెలిపారు తిరిగి తిరిగి విసిగిపోయామని సోమవారం లోపు న్యాయం చేయకపోతే పెట్రోల్ పోసుకొని కలెక్టరేట్ ఎదుటే కాల్చుకుంటామంటూ బెదిరించారు మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు