గుంతకల్లు: గుత్తి మండలం కొత్తపేట శివారులో లారీ, ఐచర్ ఢీ, ప్రమాదంలో మృతి చెందిన క్లీనర్ అభిజిత్ గా గుర్తించిన పోలీసులు
అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం వేకువజామున ముందు వెళ్తున్న టిప్పర్ లారీని వెనుక నుంచి ఐచర్ ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన యువకుడు క్లీనర్ అభిజిత్ గా పోలీసులు గుర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా టికోట తాలూకా కనమాడి గ్రామానికి చెందిన యువకుడు అభిజిత్ డ్రైవర్ అక్షయ్ తో కలిసి ఐచర్ కు వెళ్లేవాడు. ఈ క్రమంలో కొత్తపేట శివారులో ఎదురుగా వెళ్తున్న టిప్పర్ లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటనలో ఐచర్ లో ఇరుక్కుని అభిజిత్ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.