గద్వాల్: గద్వాల: రేపల్లెలో ఘనంగా పౌరహక్కుల దినోత్సవం - అధికారుల కీలక సూచనలు
జోగులాంబ గద్వాల జిల్లా రేపల్లె గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహించారు. కుల వివక్ష, అంటరానితనం పాటించడం నేరమని అధికారులు హెచ్చరించారు. గ్రామంలో శాంతియుత వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని సూచిస్తూ, అధికారులంతా గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.