ధర్మారం: మేడారంలో గుంతల మయంగా మారిన లోలెవెల్ బ్రిడ్జి, అవస్థలు పడుతున్న వాహనదారులు
ధర్మారం మండలం నంది మేడారంలోని లోలెవెల్ బ్రిడ్జి వద్ద ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వాహనదారులు గుంతల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు బ్రిడ్జి చెడిపోయి చాల చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. వర్షం పడినప్పుడల్లా గుంతల్లో నీరు నిలిచి వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు చొరవ తీసుకొని హై లెవెల్ వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.