పత్తి రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి జిన్నింగ్ మిల్లు ప్రతినిధులు, సీసీఐ అధికారులను కోరారు. పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా శనివారం సాయంత్రం 5 గంటలకు కర్నూలు కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పత్తిని బాగా ఆరబెట్టి తీసుకొని వెళ్తే మంచి ధర వస్తుందని రైతులలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తి కొనుగోలు చేయాలని సూచించారు. పత్తిని కొనుగోలు చేసిన తర్వాత వారం రోజులు పడుతోందన