సూర్యాపేట: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై కార్మికుల ఆందోళన, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నాయకులు
మణుగూరు డిపో కండక్టర్ ప్రవళిక మృతికి నిరసనగా సూర్యాపేట ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, ఉద్యోగం కల్పించాలని, కార్మికులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.