బనగానపల్లె: అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి వివరణ
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కృష్ణపట్నం, రామాయపట్నం పోర్టులో నెలకొన్న సమస్యలు, కోల్డ్ స్టోరేజ్ ల వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు.