శ్రీశైలం: ఆత్మకూరులో 7 మద్యం షాపులకు దరఖాస్తులు దఖలు చేసుకొండి: నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ సాధు రవికుమార్
నూతన మద్యం విధానంలో భాగంగా ఆత్మకూరు ఎక్సైజ్ కార్యాలయంలో నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ సాధు రవికుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలో 4, రూరల్లో 2, కొత్తపల్లి మండలంలో 1 చొప్పున మొత్తం 7 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షలు చెల్లించాలని, ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చన్నారు. అక్టోబర్ 1 వరకు గడువుందన్నారు.