గన్నవరం: పామర్రులో ప్రజలతో టీ తాగుతూ సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
పామర్రు గఫ్ఫార్ సెంటర్లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటించారు. స్థానికులతో కలిసి టీ తాగుతూ, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించారు. సమస్యల పరిష్కారమే తన బాధ్యత అని ఆయన తెలిపారు.