ప్రతిరోజు సుమారు 1500 మంది రోగులు వస్తున్న నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు అన్ని మౌలిక సదుపాయాలు ఆధునిక వైద్య పరికరాలు మెరుగైన చికిత్స సేవల అందించాలని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఆదేశించారు. బుధవారం ప్రభుత్వ సరోజన వైద్యశాల కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి ఫరూక్,ఎంపీ బైరెడ్డి శబరి, కమిటీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు