జగిత్యాల: గణేష్ నిమజ్జనంలో సేవలు అందించిన 107 మందికి ఎస్పీ అభినందన
జగిత్యాల జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా ముగించడంలో పోలీసులకు సహకరించిన ట్రాన్స్జెండర్లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు వాల్మీకి ఆవాస్ విద్యార్థులను ఎస్పీ అశోక్ కుమార్ సత్కరించారు. నిమజ్జన బందోబస్తులో పాల్గొన్న 107 మందికి ప్రశంస పత్రాలు అందజేశారు.