ఒంగోలు అర్బన్: పేకాట ఆడుతున్న ముగ్గురు అరెస్ట్.. రూ.28,420/- నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం
Ongole Urban, Prakasam | Aug 19, 2026
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒంగోలు టాస్క్ఫోర్స్ పోలీసులు పేకాట, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనమనమేళ్లూరు పంచాయతీ గ్రామ శివారులో తేదీ 19.08.2026 సాయంత్రం టాస్క్ఫోర్స్ ఇన్చార్జ్ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సి. చెంచయ్య మరియు సిబ్బంది పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.